SANKRANTI
సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు January 14, 2023 *సంక్రాంతి సమరసతకు నాంది*🕉️🚩🙏 *బౌద్ధిక్ బిందువులు* *"ఉన్నత సంస్కారాలు, ఒకే ధర్మం, ఒకే సంస్కృతి, ఆలోచనలలో ఆకాంక్షలతో సమానత్వం ఆధారంగా ఈ దేశపు జాతీయ జీవనంలోని నిర్మాణమైంది. మకర సంక్రమణం వంటి పర్వదినాలు మన ఈ ప్రాచీన సంస్కారాలను, భావనలను సుదృఢం చేస్తాయి. అంతేగాక సంక్రాంతి సమయంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అంటే హరిదాసు, బుడబుక్కలవారు. జంగం దేవరలు, గంగిరెద్దుల వారు, పిట్టల దొరలు, సోదెమ్మ, భట్రాజులు, కొమ్ముదాసర్లు రైతులు, గ్రామవాసులు, నగరవాసులు వంటి అందరూ కలిసి పరస్పరం సహకరించుకుంటూ పండుగను జరుపు కుంటారు. అందుకే సంక్రాంతి పండుగ సామాజిక సమరసతకు నాంది పలుకుతుంది."* 👉 సంక్రాంతి నేపథ్యం 👉భోగి, సంక్రాంతి, కనుమ పండుగ విశిష్టత 👉 *మానవ జీవితంలో సంక్రమణం - శ్రీ గురూజీ* 👉 *సంఘటనా శాస్త్రపు ఆదర్శం - వయం పంచాధికం శతం* 👉 సంక్రాంతి సమరసతకు నాంది సూర్యచంద్రుల గమనాన్ని బట్టి సంవత్సరంలో నెలలను లెక్కించటం మనదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. చంద్ర గమనాన్ని బట్టి లెక్కిస్తే చాంద్రమానం అని, సూర్య గమనాన్ని బట్టి లెక్కిస్తే సూర్యమానం అనిఋ పిలుస్...