SANKRANTI




సంక్రాంతి ఉత్సవం బౌద్ధిక్ బిందువులు
January 14, 2023

*సంక్రాంతి సమరసతకు నాంది*🕉️🚩🙏
*బౌద్ధిక్ బిందువులు*

*"ఉన్నత సంస్కారాలు, ఒకే ధర్మం, ఒకే సంస్కృతి, ఆలోచనలలో ఆకాంక్షలతో సమానత్వం ఆధారంగా ఈ దేశపు జాతీయ జీవనంలోని నిర్మాణమైంది. మకర సంక్రమణం వంటి పర్వదినాలు మన ఈ ప్రాచీన సంస్కారాలను, భావనలను సుదృఢం చేస్తాయి. అంతేగాక సంక్రాంతి సమయంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అంటే హరిదాసు, బుడబుక్కలవారు. జంగం దేవరలు, గంగిరెద్దుల వారు, పిట్టల దొరలు, సోదెమ్మ, భట్రాజులు, కొమ్ముదాసర్లు రైతులు, గ్రామవాసులు, నగరవాసులు వంటి అందరూ కలిసి పరస్పరం సహకరించుకుంటూ పండుగను జరుపు కుంటారు. అందుకే సంక్రాంతి పండుగ సామాజిక సమరసతకు నాంది పలుకుతుంది."*

👉 సంక్రాంతి నేపథ్యం
👉భోగి, సంక్రాంతి, కనుమ పండుగ విశిష్టత
👉 *మానవ జీవితంలో సంక్రమణం - శ్రీ గురూజీ*
👉 *సంఘటనా శాస్త్రపు ఆదర్శం - వయం పంచాధికం శతం*
👉 సంక్రాంతి సమరసతకు నాంది

సూర్యచంద్రుల గమనాన్ని బట్టి సంవత్సరంలో నెలలను లెక్కించటం మనదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. చంద్ర గమనాన్ని బట్టి లెక్కిస్తే చాంద్రమానం అని, సూర్య గమనాన్ని బట్టి లెక్కిస్తే సూర్యమానం అనిఋ పిలుస్తాము. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన రోజునే ధను స్సంక్రమణం అంటాం. అప్పటి నుంచి మకరరాశిలో ప్రవేశించేంత వరకు ఉన్న నెలరోజులూ ధనుర్మాసం అవుతుంది. ఈ ధనుర్మాసం సంక్రాంతి ముందు రోజైన భోగి రోజున ముగుస్తుంది.

ధనుర్మాసం ముగిసిన వెంటనే మొదలయ్యే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు మకరరాశిలో సంక్రమిస్తాడు (అంటే ప్రవేశిస్తాడు. కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అంటారు. భక్తవత్సలుడైన విష్ణుమూర్తి రాశి మకరరాశి, ఈరోజు నుంచి దక్షిణాయణం పూర్తయి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. ఉత్తర అంటే మోక్షం అనే అర్థం కూడా ఉంది. అందుకే మహాభారత యుద్ధ సమయంలో భీష్మాచార్యుడు తన తనువుని త్యజించడానికి ఉత్తరాయణం వరకు వేచి చూస్తాడు. మకర సంక్రమణ భాగ్యాలను కలిగించే భోగి కాలం నుంచే భూమిలో వెచ్చదనం ప్రారంభమవుతుంది. చలి తగ్గుతూ వస్తుంది.

*'సంక్రాంతౌయాని దత్తాని హవ్య కావ్యాని దాత్రుభిః తాని నిత్యం దదాతార్యం పునర్జన్మని జన్మని''*

అని స్కాంధపురాణంలో చెప్పబడింది. దానిననుసరించి సంక్రాంతినాడు చేసే దానధర్మాల వల్ల పునర్జన్మ ఉండదు అని తెలుస్తుంది. ఉత్తరాయణ మహాఋ పుణ్యకాలంలో చేసే నదీస్నాన, జపాదులు అక్షయ ఫలితాలు కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతులతో, అనందాల కోలాహలంతో, ఈ పండు గను మూడు రోజులు చేసుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం.
అందుకే దీనిని పెద్దపండుగ అని పిలుస్తారు. 
 ఈ ధనుర్మాసం సంక్రాంతి ముందురోజైన భోగి మూడు రోజుల పండగలో మొదటిగా భోగి, తర్వాత సంక్రాంతి, ఆ తర్వాత కనుమ జరుపుకుంటారు. కొన్ని చోట్ల నాలుగో రోజున ముక్కనుమ కూడా జరుపుకుంటారు. మొదటి రోజు భూమికి పూజ చేస్తారు. రెండవ రోజున పండుగను ఇంట్లోవారు జరుపుకుంటే మూడో రోజు పాడి పశువులను అందంగా అలంకరించి పండుగ చేసు కుంటారు. *మన సంస్కృతిలో ప్రకృతికి ప్రాముఖ్యం ఇచ్చారు..* ఎందుకంటే ప్రకృతి లేనిదే మనం లేము. ఈ గొప్ప భావనని ప్రజలకు కలిగించడానికి ఆచారం పేరుతో చేసుకునే ప్రముఖ పండుగే సంక్రాంతి.

*భాగ్యాలను కలిగించే భోగి*

ధనుర్మాసం చివరి రోజే భోగి. ఈరోజు ఉదయాన్నే లేచి అందరూ ఇంట్లోని పాత వస్తువులన్నింటినీ ఆరుబయట ఒకచోట పేరుస్తారు. కొత్త వస్తువులతో నిత్యనూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా ఆ పాతవస్తువులను భోగి మంటల్లో వేస్తారు. భోగి స్నానాలు చేస్తారు. ఇక సాయంత్రం వేళ బొమ్మల కొలువు పెట్టి ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ గడుపుతారు. ఇంట్లో చిన్న పిల్లలుంటే అందరూ కలిసి రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి బోగిపళ్లు పోస్తారు. ఈరోజు సాక్షత్తు ఆ విష్ణుమూర్తే చిన్నపిల్లలను ఆశీర్వదిస్తారని అంటారు. అలాగే ఆ సమయంలో పేరంటాలలో పంచిపెట్టే పక్క, తమలపాకు, శనగలు, అరటిపండ్లు మొదలైన వాటితో నవగ్రహాలు శాంతించి గ్రహపీడ తొలిగేవిధానం అంతర్లీనం గా ఉంది. తెలంగాణా ప్రాంతంలో సకినాలు అనే పిండి వంటను చేసుకుంటే, ఆంధ్రలో అరిసెలు చేసుకుంటారు. 

*మకర సంక్రాంతి*

రెండవ రోజు, అసలైన పండుగ రోజు సంక్రాంతి. ఈరోజు తెల్లవారుఝామునే నిద్రలేచి ఇంటిని రకరకాల అందమైన రంగవల్లికలతో, బంతిపూలతో అలంకరించి కొత్త బట్టలు వేసుకుని బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా గడుపుతారు. సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులవారు. ఇక మరో ఆనందమైన, అలరించే విషయం హరిదాసు. ఈ రోజున 'హరిలో రంగ హరీ అంటూ కంచు గజ్జెలు ఘల్లుఘల్లు శబ్దాలతో చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ, తలపై రాగి అక్షయపాత్ర పెట్టుకుని, అది కదలకుండా సరిచేసుకుంటూ హరిదాసు ప్రత్యక్షమై సందడి చేస్తాడు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ సరదాగా గడుపుతారు. కొన్నిచోట్ల ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులు తారు. మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా ఇస్తారు. మహారాష్ట్ర, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు గౌరీదేవిని పూజించి నువ్వుల లడ్డూలను నైవేద్యంగా పెడతారు. ముత్తయిదువులని పిలిచి వారికి బహుమతులతోఋ పాటు నువ్వుల లడ్డులను తినిపించి, 'తీపి తిని తీయగా మాట్లాడు నువ్వులు తిని ముత్తయిదువుగా ఆరోగ్యంగా ఉండు' అంటూ దీవిస్తారు. కొన్నిచోట్ల బొమ్మల కొలువూ ఏర్పాటు చేస్తారు. 

*కన్నులపండుగ కనుమ*

చివరిదైన కనుమ ఆడపిల్లలకు ప్రత్యేకమైనది. ఈ రోజు ఆడపిల్లలందరూ గొబ్బెమ్మలు పెడతారు, గొబ్బెమ్మ అంటే గోపిక బొమ్మ, గోపికలంటే కృష్ణుని భక్తురాళ్ళు. ఆడపిల్లలు ఈ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. కనుమ రోజు ప్రయాణం చేయరు. మనదేశం సేద్య ప్రధానదేశం. అందుకే మనదేశంలో పండుగలు భూమి, వ్యవసాయ ఉపకరణాలను పూజించే విధంగా రూపొందాయి. కనుమ నాడు పశువులను చెరువు దగ్గరికి తీసుకెళ్లి వాటిని అందంగా అలంకరించి పూజిస్తారు. అందుకే కనుమను
పశువుల పండుగ అని కూడా అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పంచుకోవాలని పిట్టలకోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవిఋ ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉందు వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. 

*మానవజీవితంలో సంక్రమణం: శ్రీ గురూజీ*
సంక్రమణం ఏటా సహజంగానే సకాలంలో వస్తుంది. కానీ మానవ జీవితంలో అలా రాదు. మానవజీవితంలో సంక్రమణం వస్తే భవిష్యత్తు పట్ల సముచిత దృక్పథాన్ని ఏర్పరచుకోవడం తేలికవుతుంది. భారతజాతి జీవితంలో ఈతరంలో జరిగిన సంక్రమణం మహత్వభరితమైనది. సౌభాగ్యవంతమైనది. మన హృదయభారం దిగిపోయింది. పరాయి పెత్తనం అనే విషం కొంచెంగానైనా తొలగి పోయింది. దేశమాత శరీరం విషవిముక్తమై సుఖసంపదలతో కూడిన భావి సామాజిక జీవితం వైపు దృష్టి సారిస్తుంది.
సంక్రమణకాలపు అనుభవాలు పరిపరి విధాలుగా ఉన్నాయి. అంతా సుఖమయమై ఉండాలనుకోవడం పొరపాటు. 
జాతీయ జీవనంలో అనేక సమస్యలు, సంకట పరిస్థితులు ఎదురౌతున్నాయి. బహుశా కొంతకాలం వరకూ అన్ని దిశలలోనూ అంధకారమే ఆవరించుకొని ఉండవచ్చు. ప్రగతి కనిపించకపోవచ్చు. మంచికి మారుగా చెడే జరుగు తున్నట్లు తోచవచ్చు. ఒక సంకటం తప్పిపోతే మరొక సంకటం సిద్ధమౌతూ ఉండవచ్చు. దూరదృష్టి లేనివారు, దూరాన్ని చూడడం ఇష్టంలేనివారు ఇక చేయవలసిందేమీ లేదని, అంతా అయిపోయిందని భావిస్తున్నారు..

కానీ ఇది ధైర్యం, ఆశావహ దృక్పథం ఉన్నవారు తమ బుద్ధిని ఉపయోగించవలసిన సమయం. మానవ జీవితంలో రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతాయి. వాటిలో కీర్తి- అపకీర్తి, సుఖం-దుఃఖం, గెలుపు-ఓటమి వంటి ద్వంద్వాలు ఎదురవుతూంటాయి. తాత్కాలిక పరిస్థితులకు క్షోభపడడం, స్వబంధుజనులకు కష్టం కలిగించడం తగని పనులు. ప్రయోగాలకు కొంత సమయం ఇవ్వవలసింది. ఒప్పు జరిగినా తప్పే జరిగినా మనసు పాడుచేసుకోకుండా, సమస్యల మూలాలను శోధిస్తూ, పరస్పర వైమనస్యాలకు చోటివ్వకుండా, శాంత చిత్తంతో వ్యవహరించాలి.
స్వయంసేవకులు తమ హృదయాలను అమృతమయం గా ఉంచుకొని, ప్రజలందరినీ తమవారిగా భావిస్తూ, లోకంలోని సంక్షోభ పరిస్థితులను చూస్తూ కూడా తమ ఆలోచనలను స్థిరంగా ఉంచుకుంటూ పవిత్ర జీవితాలను సాగించడానికి సంకల్పించాలి. ప్రపంచానికి ఒక దిశను చూపించడం కోసం కూడా ఈ సంకల్పాన్ని వదులుకోకుండా భారత ప్రజల జీవితాలను తిరిగి శక్తివైభవ సమన్వితంగా చేసే ధ్యేయాన్ని సాధించడానికి నిశ్చితమైన, ప్రణాళికాబద్ధమైన మార్గంలో ముందుకు సాగుతూనే ఉండాలి. 
ప్రతి స్వయం సేవకుడు తన దృష్టి, లక్ష్యం నుంచి పక్కకు మరలకుండా జాగ్రత్త వహించాలి. మన చుట్టూ ఉన్న అవ్యవస్థను, దురవస్థనూ చూస్తే ఆగ్రహం వచ్చి విద్వేషభావానికి లోనయ్యే అవకాశం ఉంది. ద్వేషానికి లొంగిపోవడంవల్ల ఏ పనీ జరగదు. మనసులో క్షమాగుణం ఉండాలి. మనవారి పట్ల ఆత్మీయత ఏ మాత్రం తగ్గకూడదు. 

*సంఘటనా శాస్త్రపు ఆదర్శం - వయం పంచాధికం శతం*
మహాభారత కథలోని ధర్మరాజు సంఘటనా కార్యాన్ని చేపట్టిన కార్యకర్తలకు ఆదర్శమని సంఘ స్థాపకులు డాక్టర్జీ చెప్పారు. గర్వం, ద్వేషం, క్రోధం, విరోధభావం మొదలైన
విపరీత భావనలకు ధర్మరాజు తన హృదయంలో లేశమైనా చోటియ్యలేదు. తాను అనేక కష్టాలు అనుభవించడానికి, అడవుల పాలు కావడానికి కారణమైన దుర్యోధనుని పట్ల కూడా ఆయన ఎప్పుడూ క్రోధం వహించలేదు. వల్కలాలు ధరించి అరణ్యంలో నివసిస్తున్న పంచపాండవుల ముందు తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించడానికై దుర్యోధనుడు తన నూర్గురు సోదరులతోను కలిసి అట్టహాసంగా వచ్చాడు. అక్కడ అతడి విశృంఖల ప్రవర్తన వల్ల గంధర్వులతో కలహం వచ్చింది. ఆ గంధర్వులు అతడిని ఓడించి బంధించారు. ఇది విన్న ధర్మరాజు సోదరులు నలుగురూ మహానందపడి, "కాగల కార్యం గంధర్వులే నెరవేర్చారు. మన మార్గం నిష్కంటకమైంది" అన్నారు. కానీ యుధిష్ఠిరుడు మాత్రం *"పరస్పరం పోట్లాడుకునేటప్పుడు మనం అయిదుగురం, వాళ్లు నూరుగురు, పరాయివారితో జగడం వచ్చినపుడు మనం నూట అయిదుగురం" వయం పంచాధికం శతం" అన్నాడు.* కౌరవులను బంధ విముక్తులను చేయించాడు. సంఘటనాశాస్త్రంలో ఆవశ్యకత లక్షణాలుగా చెప్పే మధుర మైన వాక్కుకు, హృదయానికి ధర్మరాజే మన ఆదర్శం.

*సమరసతకు నాంది*
ఉన్నత సంస్కారాలు, ఒకే ధర్మం, ఒకే సంస్కృతి, ఆలోచనలలో ఆకాంక్షలతో సమానత్వం ఆధారంగా ఈ దేశపు జాతీయ జీవనం నిర్మాణమైంది. మకర సంక్రమణం వంటి పర్వదినాలు మన ఈ ప్రాచీన సంస్కారాలను, భావనలను సుదృఢం చేస్తాయి. అంతేగాక సంక్రాంతి సమయంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అంటే హరిదాసు, బుడబుక్కలవారు. జంగం దేవరలు, గంగిరెద్దుల వారు, పిట్టల దొరలు, సోదెమ్మ, భట్రాజులు, కొమ్ముదాసర్లు రైతులు, గ్రామవాసులు, నగరవాసులు వంటి అందరూ కలిసి పరస్పరం సహకరించుకుంటూ పండుగను జరుపు కుంటారు. అందుకే సంక్రాంతి పండుగ సామాజిక సమరసతకు నాంది పలుకుతుంది.

సంక్రాంతి ఉత్సవ అమృత వచనాలు

1. పరమ పూజనీయ శ్రీ గురూజీ ఇలా అన్నారు
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం హిందూ సమాజం యొక్క జాతీయ స్వరూపాన్ని గుర్తించి ప్రతి వ్యక్తి హృదయంలో రగులుతున్న భారత భక్తిని జాగృతం చేసి, దేశ సేవ కొరకు సర్వస్వార్పణం, సచ్చిలం, మంచి నడవడి తో కూడిన జీవితం గడపడానికి, అలాగే ఆ సేతు హిమాచలం సామరస్యపూర్వకమైన ఏకాత్మ సమాజ జీవనంను పున ప్రతిష్ట చేయుటకు విశేషమైన ప్రయత్నం చేస్తుంది.

2. 
Comments

Popular posts from this blog
హిందూ సంస్కృతి విశేషతలు
April 24, 2024
హిమాలయాల నుండి సముద్రం వరకు విస్తరించిన భూమి, వైవిధ్యంతో నిండిన ఇక్కడి ప్రకృతి, ఏకాత్మత సాక్షాత్కారం భారతీయ సంస్కృతికి బలమైన పునాది. అ) యజ్ఞమయం, త్యాగమయం 'ఇదం న మమ' అంటే ఇది నాకు కాదు, 'సర్వభూతహితేరతా' (జీవులన్నింటి హితంకోసం కృషిచేయాలి) మొ॥ కాబట్టే ఇక్కడ త్యాగులైన మహాపురుషుల పరంపర ఉంది. ఆ) కర్తవ్య నిర్వహణ చేయాలని కోరుకోవడం- త్యాగంపై ఆధారపడిన సంస్కృతి. కర్తవ్యపాలన అంటే ధర్మపాలన, ఇతరుల కోసం చేసిన కార్యం. ధర్మాన్ని కోరుకోవడం - పుత్ర ధర్మం, పితృధర్మం, పతిధర్మం, రాజధర్మం, ప్రజాధర్మం, మొదలైనవి. ఇ) సహిష్ణుత అన్ని మార్గాలను (పూజాపద్దతి, ఆలోచనలు) సరియైనవేనని గౌరవించడం. “ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి.” (అయితే ఇది అబ్రహాం మతాలైన ఇస్లాం, క్రైస్తవాలకు ర్తించదు) ఈ) సర్వపంధ సమాదరణ - 'సర్వ సమావేషక సంస్కృతి' అన్ని సంప్రదాయాలకు సమాదరణ, ఏదో ఒక సంప్రదాయం లేదా ప్రదేశం విశేషమైనది అనిగాక కేవలం మానవుడి గురించే ఆలోచించడం. ఉ) అందరినీ కలుపుకోగల్గిన జీర్ణం చేసుకోగల్గిన సామర్థ్యం శకులు, హూణులు మొదలగు వారిని కలిపేసుకున్న ఉదాహరణ కొత్తది, నుంచి ఆలోచన ఎక్కడినుండి వచ్చినా దాన్ని స్వీకరించే మనస్త...
Read more
సంఘం ప్రాథమిక విషయాలు(శాఖ, మిలన్, ఉత్సవం పరిచయం)
April 25, 2024
సఫల #కార్యపద్ధతి #సంఘశాఖ* విధర్మీయులు మన దేశాన్ని వారు శక్తివంతులుగా ఉండి ఆక్రమించుకోలేరు మన లోపాల్ని పసిగట్టి అదనుచూసి ఆక్రమించారు అంటే శత్రువు బలం కారణంగా మనం బానిసత్వంలోకి వెళ్ళలేదు మన సమాజంలోని బలహీనత కారణంగా మనల్ని మన భవిష్యత్ తరాలు బానిసత్వంలోకి వెళ్లి ఓడిపోయాము. అసలు మన జాతి బలహీనం కావడానికి అనైక్యత క్రమశిక్షణారాహిత్యం సమయపాలన లేకపోవడం మరియు నలుగురితో కలిసి పని చేయకపోవడం అనేవి ప్రధాన కారణాలు అని డాక్టర్ జి సమాజాన్ని అధ్యయనం చేసిన తర్వాత సంఘ్ ని ప్రారంభించడం జరిగింది. సంఘ కార్యక్రమాలు కార్యక్రమాలు గానే ఉండిపోయింది ఇది నిరంతర సాధన మనకున్న లక్ష్యాన్ని చేరు ఉపకరించే విధంగా మన కార్యక్రమ నిర్వహణ విధానం ఉండాలి. చెప్పింది విని సంఘం నడవలేదు చూసి నేర్చుకోవడం వల్లనే సంఘం నిలబడింది. శాఖ జరుగుతే సంస్కారం వస్తుంది అనుకుంటే పొరపాటు శాఖ జరగాల్సిన విధంగా జరిగితేనే సంస్కారం నిర్మాణం అవుతుంది. సంఘంలో లభించేది కేవలం ఆనందం మాత్రమే. శిక్షణ పొందుతారు. *క్రమశిక్షణ వారి రక్తంలో రంగరించుకుపోతుంది. #శారీరకమైన #క్రమశిక్షణ #కన్నా #మానసిక #క్రమశిక్షణ #మరింత #ముఖ్యమైనది. తమ వ్యక్తిగతమైన భావోద్వేగాలను, ప్రవృత...










🚩🚩🚩🚩🚩🚩
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - సికింద్రాబాద్ భాగ్* మారేడుపల్లి నగర్

*(సంక్రాంతి ఉత్సవ ఆహ్వానం)*

శాఖ మాధ్యమం ద్వారా వ్యక్తి నిర్మాణం తద్వార దేశ నిర్మాణం అనే కార్య పద్ధతి ద్వారా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమాజ వికాసానికి విశేషమైన కృషి చేస్తుంది.

సంఘం నిర్వహించే ఆరు ఉత్సవాలలో సంక్రాంతి పర్వదినం ఒకటి. సమాజంలో సమరసత నిర్మాణం చేయడానికి ఈ ఉత్సవాలను సంఘ శాఖలలో నిర్వహిస్తారు. ఈ సంక్రాంతి ఉత్సవంలో తామెల్లరు కుటుంబసమేతంగా పాల్గొనగలరని ఆహ్వానించడం అయినది.

 *ప్రధాన వక్త*
శ్రీ 

*తేది :* 
*సమయం:* 
ఉదయం 7:30గంటలకు 

*స్థలం:* 
శ్రీ సరస్వతి విద్యా మందిర్,
 (నేషనల్ హైవే పక్కన)

*సూచనలు:* 

నిర్ణీత సమయానికి 10 నిమిషాల ముందు రాగలరు.

*భవదీయ*

*అమృతవచనం*

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం హిందూ సమాజం యొక్క జాతీయ స్వరూపాన్ని గుర్తించి ప్రతి వ్యక్తి హృదయంలో రగులుతున్న భారత భక్తిని జాగృతం చేసి, దేశ సేవ కొరకు సర్వస్వార్పణం, సచ్చిలం, మంచి నడవడి తో కూడిన జీవితం గడపడానికి, అలాగే ఆ సేతు హిమాచలం సామరస్యపూర్వకమైన ఏకాత్మ సమాజ జీవనంను పున ప్రతిష్ట చేయుటకు విశేషమైన ప్రయత్నం చేస్తుంది.

*-పరమ పూజనీయ శ్రీ గురూజీ*


*Rashtriy Swayamsevak Sangh* 
*Secunderabad Bhag*🚩🙏🕉️
*{Sankranti Utsav Invitation}*

You are cordially invited to participate in the celebration of Sankranti.
This holy day marks the commencement of Sun's northern course in the sky.From this day, day duration increases and night decreases. This positive change of increasing the brighter aspect in life is Sankranti, Also called Pongal. 
On this occassion, there will be a talk on the significance of
Sankranti.

*Utsav details*

*Date :* 
*Time :* 
*Venue :* 

*Directions :* 

*Speaker:*
  


*Bhavadhiya*🚩
(Bhag Kaaryavaha)

*Bharat matha ki jai*🕉️

Popular posts from this blog

RAKSHABANDHAN

VIJAYA DASHMI

GURU POOJA