HINDU SAMRAJYA DINOTSAVAM
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - సికింద్రాబాద్ భాగ్*
*హిందూ సామ్రాజ్య దినోత్సవ ఆహ్వానము*🚩🙏
ఈ దేశంలో హిందువులు గడిచిన 800 సం॥లు విదేశ, విధర్మ వికృత సంస్కృతుల దాడులకు గురై స్వతంత్రం కోల్పోయి బానిస బ్రతుకు బతుకుతూ అదే జీవన పరమావధి అని భావించడం ప్రారంభించిన సందర్భంలో
సమస్త హిందూ జాతిని సంఘటితం చేసి బానిసత్వాన్ని చరమగీతం పాడి హిందూ సామ్రాజ్యం ను స్థాపించుటకు
ఉదయించిన వీరకిరణమే హిందూపద్ పాదుషాహి ఛత్రపతి శివాజీ మహారాజ్.
వారు స్థాపించిన హిందూసామ్రాజ్య దినోత్సవ స్పూర్తితో నిర్వహించే ఈ కార్యక్రమానికి హిందూబంధువులందరికి ఇదే మా ఆహ్వానము.
*కార్యక్రమం వివరాలు*
*వక్త :* శ్రీ
*ముఖ్యఅతిథి :*
*తేదీ & సమయము:*
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి
*స్థలం:*
*లోకేషన్ :*
*భవదీయ*
*సూచన :-*
కార్యక్రమ సమయానికి 10 నిమిషములు ముందుగా రాగలరు.
*"మనమంతా హిందువులం - బంధువులై మెలుగుదాం"*
.*BOUDIK*
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕
వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ🚩🚩🚩🚩
1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం.
శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శాహాజీ భోంస్లే, జిజాభాయి దంపతులు కూ జన్మించాడు.
తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమకలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాధలు చెప్పి వీరత్వం మొలకింపచేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను అద్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ఠాతుడయ్యాడు.
హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్‌కు చెందిన ‘తోరణ’ దుర్గాన్ని స్వాధీనం
చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన అధీనంలో ఉంచుకున్నాడు.
శివాజీ మెరపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్దతులు తెలుసుకొన్న అప్జల్‌ఖాన్ శివాజీని అంత మొదించటానికి ప్రయత్నించినపుడు వ్యూహాత్మ కంగా తను దర్శించిన పులిగోర్లతో అప్జల్‌ఖాన్ పొట్ట చీల్చి సంహరించాడు. శివాజీ విజయాలతో మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబు తన మేనమామ ‘షహిస్తాఖాన్‌ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెనుతిరగవలసి వచ్చింది.
1666లో ఔరంగజేబు కుట్రచేసి శివాజీని ఆగ్రాలో బందించినపుడు చాలా చాకచక్యంగా తప్పించుకొన్నాడు. 1674 నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు. వ్యక్తి నిర్మాణం ద్వారా సామాన్య వ్యక్తులలో అసాధారణ ప్రతిభను జాగృతం చేసి వారిని కుశలురైన నాయకులుగా తీర్చిదిద్దటం ఎలాగో చత్రపతి శివాజీ చూపించాడు. విజయమే మన ఆదర్శం కావాలని శివాజీ జీవితం తెలియజేస్తుంది.
హిందూ జీవన విధానంలో ఏ విషయాన్ని వివరించకుండా వదిలివేయలేదు, అది ఆహారం కావచ్చు విహారం కావచ్చు చివరికి యుద్ధం కావచ్చు. ప్రపంచంలో ఏ జాతికి యుద్ధ నియమాలు లేవు! మూకుమ్మడిగా దాడి చేసి, శత్రువును లొంగదీసు కోవడమే వారికి తెలిసిన ‘నీతి’. కాని కేవలం హిందువులు మాత్రమే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు యుద్ధం చెయ్యాలి, వెన్ను చూపి పారిపోతున్న వ్యక్తిని చంపకూడదు, ముసలివారు, పిల్లలు, స్త్రీలను చంపకూడదు మొదలైన నియమాలను పాటించారు.
ఐతే ఈ నియమాలను ఎవరి విషయంలో పాటించాలి అన్న అంశంలో స్పష్టత లోపించడం వల్ల పృధ్వీరాజ్ చౌహాన్ 16 సార్లు ఘోరీని యుద్ధంలో ఓడించినప్పటికీ చంపకుండా వదిలివేసాడు. కానీ ఒకే ఒక్కసారి ఘోరీ గెలిచి నప్పుడు మాత్రం పృధ్వీరాజుని బంధించాడు. అనేక హింసలకు గురి చేసాడు. ప్రజల్ని హింసించాడు, దోచుకున్నాడు.
హిందూ జాతికి తురుష్కుల నుంచి వచ్చిన ఆపదను అర్థం చేసుకోవడం, ఆ ఆపదను ఒక విస్పష్టమైన పద్ధతిలో ఎదుర్కోవడం వల్ల అత్యంత క్లిష్టపరిస్థితులలో శివాజీ కూడా హిందూ సామ్రాజ్యాన్ని విజయవంతంగా నిర్మించగలిగాడు.
ఆలోచనాపరమైన ఈ వ్యత్యాసం నేటికీ హిందూ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ మతం ఏమి చెపుతోందో, ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తరచి చూసుకోకుండా అన్ని మంచినే బోధిస్తాయి, అవి అన్నీ ఒకటే అన్న విపరీత ధోరణి వల్ల వాటినుంచి వస్తున్న దాడులను అర్థంచేసుకుని, ఎదుర్కొనడంలో హిందూ సమాజం విఫలమవుతోంది.
ఈ రకమైన వివేచనారహిత ఆలోచనా విధానం స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది. ఐతే రామజన్మభూమి ఉద్యమం తరువాత హిందువులలోని ఈ ఆత్మహత్యాసదృశమైన ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది.దాని ఫలితం మనం చూస్తూనే ఉన్నాము. కాని పూర్తి మార్పు ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన రోజునే శివాజీకి నిజమైన వారసులమని చెప్పుకోగలం. దీనిని సాధించడానికి ప్రతి వ్యక్తి తనంత తానుగా సమయం, శక్తిసామర్థ్యాలను ఉపయోగించాలి. అప్పుడే ‘స్వరాజ్యం’, ‘సురాజ్యం’ సాధ్యమవుతాయి.
*వీరోచితం వీర శివాజీ గాథ...*
పవిత్ర మహా భారతాన దండెత్తి,
హిందూ స్త్రీలను చంపి,
హిందూ ఆలయాలు కూల్చి
హిందూ ఆస్తులు లూటీ చేస్తున్న
ఆ తురష్క సైన్యంని చూసి
రోధిస్తున్న తల్లి భారతావనిని చూసి
నేనున్నా తల్లి అంటూ రివ్వున యుద్ధ రంగంలో
దూకి శత్రువులను చండాడిన కొదమ సింహం
అదిగో...అదిగో.. హైందవ వీరుడు ఛత్రపతి శివాజీ.....
జిజియా భాయ్ కడుపున పుట్టి
భారత మాత ఒడిలో పెరిగి
చిన్న నాటే కత్తి పట్టి మాతృ దేశ రక్షణకు
పరుగులు తీసిన నడిచే చుర కత్తి
అదిగో అదిగో అదిగో ....మారాట రక్తం వీర శివాజీ
పదిహేడవ ఏట రాజ్య భారం ఎత్తి
తురక పాలకులకి చుక్కలు చూపించి
తొర్న రాజ్ ఘడ్ కోటలను చుట్టుముట్టి
అఖండ హిందూ సామ్రాజ్య శంకుస్థాపన చేసిన
శత్రు భయంకరుడు... విశాల ప్రేమ హృదయుడు
అదిగో అదిగో అదిగో హిందువుల ఊపిరి "వీర్ శివాజీ".
బీజాపూర్ తురకలను - నిజాం షాహీ సుల్తానులంను
తల పొగరు ఢిల్లీ మొగలయిలను
వెంటాడి - వేటాడి రణ రంగంలో తన నెత్తురు
పణంగా పెట్టి భరత మాత కన్నీళ్లు తుడిచిన
నిండు హైందవనికి నిజాస్వరూపం
అదిగో అదిగో అదిగో హైందవ సింహం వీర శివాజీ....
తురస్కుల పాలనలో.. హైందవుల మరణాలకు
హిందూ ఆలయాల ధ్వంసాలకు సోమనాథ నిలువెత్తు సజీవ సాక్ష్యం....
తెల్ల దొరల పాలనలో విదేశాలకు తరలించ బడ్డ
హైందవ జాతి సంపూర్ణ సంపదలకు బ్రిటిష్ రాణి నెత్తినున్న కోహినూరే సాక్ష్యం....
మన జాతి సంపూర్ణ హత్యకు తెల్లోళ్లు పన్నిన కుట్రకు వారి విడకొట్టు పాలించు సిద్దాంతం సాక్ష్యం....
మన సాంప్రదాయ హత్యలకు వారి చేతిలో వక్రీకరించబడ్డ వేద సంపద కు సాక్ష్యం.......
యుద్ధం బెదిరె శబ్ధం శివాజీ
హిందువు ఒంట్లో రక్తం శివాజీ
ఖడ్గం చివర పదును శివాజీ
హిందుత్వానికి జవాబు శివాజీ
దేశ మాత రక్షణకు తొలి జవాను శివాజీ
ఇప్పుడు తిరగబడ్డ నువ్వే ఒక వీర శివాజీ.....
జై భవాని!... వీర్ శివాజీ!!..... జై భారత్ మాత!!!
*🙏సకల సుగుణాల కలబోత- జన హృదయ నేత- ఛత్రపతి శివాజీ మహారాజ్🚩*
ఉద్యమం సాహసం ధైర్యం బుద్ది శక్తి పరాక్రమా
షడైతే యత్ర వర్తంతే తత్ర దేవత సహయకః
అంటే... ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ది, శక్తి, పరాక్రమాలనెడి ఆరు గుణాలు ఎవరికుంటాయో అటువంటి వారికి దేవుడు కూడా సహకరిస్తాడని ఈ సుభాషితం యొక్క అర్థం.
ఈ సుభాషితం లో గల ఆరు సుగుణాలు కలబోసి వీరుడిగా ఎదిగి ఛత్రపతిగా హిందూ హృదయ సామ్రాట్ గా నిలిచాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్.
శివాజీలో గల ఈ ఆరు గుణాలను ఒకసారి విశ్లేషించుకుంటే...
*ఉద్యమం*
తను రాజు గాకున్నా తన 14ఏళ్ళ వయసునుండే స్వరాజ్య సాధన కోసం కొండ కోనల్లో నివసించే మావళీలు అనే గిరిజనులను దేశ భక్తులుగా మలచి మొఘలులపై పోరాటానికి ముందు నడిపిన మహా ఉద్యమకారుడు మన శివాజీ.
*సాహసం - ఆగ్రా కోటలో నుండి తప్పించుకోవడం *
ఆగ్రా కోటలోకి దౌత్యం పేర పిలిచి కుయుక్తి తోడ తనను బంధించిన ఔరంగజేబు ను బోల్తా కొట్టించి దుర్భేద్యమైన కోటనుండి తప్పించుకుని ఆగ్రా నుండి విస్తార మొఘలు సామ్రాజ్య అధినేతల తప్పించుకుని పూణె వరకు చేరుకోవడంలో శివాజీ యొక్క సాహసం మనకు కనబడుతున్నది.
*ధైర్యం - శయిస్తాఖాన్ పై దాడి*
పూణె కోటను యశ్వంత్ అనే ఉడుము సహాయంతో 125 అడుగుల ఎత్తున్న కోటను ఎక్కి అసమాన ధైర్యంతో శయిస్తాఖాన్ ను ఎదుర్కొని వాడు గోడ దూకి పారిపోతుంటే వాని వేళ్ళు నరకడం శివాజీ ధైర్యానికి నిదర్శనం.
*బుద్ది - అఫ్జల్ఖాన్ వధ*
బాహుబలంతో పాటు బుద్దిబలం కూడా తోడైతే అత్యంత బలవంతున్ని సైతం మట్టికరిపించ వచ్చని శివాజీ నిరూపించిన ఉదంతం మనకు అఫ్జల్ఖాన్ వధ ఉదంతం తెలియజేస్తూంది. అఫ్జల్ఖాన్ తన రాజ్యంలోకి చొచ్చుకుని వచ్చి ఎన్నెన్నో రాక్షస కృత్యాలు చేస్తున్నా తనకు అనుకూలమైన చోటుకు అఫ్జల్ వచ్చేదాకా వేచి చూసి, భయపడ్డట్లు నటించి, వానిని పొగిడి, బీజాపూర్ నుండి 1200కిలోమీటర్ల దూరం 28రోజులు ప్రయాణింప జేసి ప్రతాప్ ఘడ దాకా రప్పించి వాని ఎదుటకు నిరాయుధునిగా వెళ్లినట్లు నటించి యుక్తితో అఫ్జల్ఖాన్ ను వధించిన కుశాగ్రబుద్ది శివాజీది.
*శక్తి - శక్తివంతమైన ప్రమధగణాలుగా మలచిన ధీశాలి మన శివాజీ.
*
యశాజీ కంక్, తానాజీ మాల్సురే,నేతాజీ పాల్కర్, సూర్యాజీ మాల్సురే,కొండాజీ కంక్,బాజీభీడె వంటి ఎందరెందరో మావళీలను శక్తివంతమైన ప్రమధగణాలుగా మలచిన ధీశాలి మన శివాజీ.
*పరాక్రమం*
అవసరమైతే మూడడుగులు వెనక్కివేసి శతృవును గురిచూసి వేటాడిన పరాక్రమశాలి శివాజీ.
ఇలా ఈ ఆరుగుణాలు పుణికిపుచ్చుకుని భవానీ మాత ఇచ్చిన ఖడ్గంతో వీరవిహారం చేసి హైందవ సామ్రాజ్య స్థాపన చేసిన మహావీరుడు మన శివాజీ.
ఇవే కాకుండా ఇతర సుగుణాలను కూడా శివాజీలో మనం చూడవచ్చు.
*జట్టుభావన*
ఒక పని సఫలం కావాలంటే తానొక్కడే కాక అందరినీ కల్పుకపోతే జట్టుభావన తొ విజయం సాధించవచ్చని శివాజీ నిరూపించాడు. అందరిలో స్వరాజ్య భావన జాగృతము చేసాడు. కొండ ప్రాంతాలలోని మావళీలను, కొంకణ తీరంలోని కోలీలను, మైదాన ప్రాంతాల్లోని భండారీలను,సామాన్యులను,సంపన్నులను,అధికార వర్గాల వారిని చేరదీసాడు.ఆధ్యాత్మిక గురువులు రామదాసు, తుకారాం వంటివారి ఆశీస్సులు అందుకున్నాడు.తనను వ్యతిరేకించే సర్దార్లను ఓపికగా తనవైపు తిప్పుకున్నాడు.స్వరాజ్యభావన అందరిలో జాగృతం చేసి భవ్య హైందవ రాజ్య నిర్మాణం గావించాడు.
*ప్రచండ దేశభక్తి*
చిన్నప్పటినుండి తల్లి ఉగ్గుపాలతో నూరిపోసిన దేశభక్తి కారణంగా
*తన తండ్రితో బీజాపూరు సుల్తాను కొలువుకు వెళ్ళినపుడు సుల్తానుకు వంగి సలాము చేయకపోవడం,
*ఎక్కడ కూడా మొఘలులకు లొంగకుండా వారిని జీవితాంతం ఎదిరించి బతకడం, *బాల్యంలోనే కోటను ఆక్రమించి భగవాధ్వజం ఎగరేయడం,
ఇంకోసందర్భంలో ... శివాజీ యొక్క స్వరాజ్య నాణాలను తమ టంకశాలలో ముద్రిస్తామని ప్రతిపాదిస్తే దాన్ని తిరస్కరించి రాజ్యంలో నకిలీ నాణాల చలామణి గాకుండా అడ్డుకున్నాడు. ఇలా అణువణువునా శివాజీలో ప్రచండ దేశభక్తి ప్రతిధ్వనిస్తుంది.
*ఆదర్శ పాలకుడు*
శివాజీ కి తన తండ్రి నుండి మావళ ప్రాంతంలోని కేవలం 36 గ్రామాలు మాత్రమే వారసత్వంగా లభించాయి అదే తర్వాత ఒక భవ్య సామ్రాజ్యం గా విస్తరించింది తన పనుల ద్వారా వ్యవహార శైలి ద్వారా అధికారం వ్యవస్థలను ఎలా నిర్వహించాలి అనేది చేసి చూపించాడు బంధుప్రీతి దూరం పెట్టాడు సుమారు మూడు వందల కోటలు తన దగ్గర ఉన్నా ఏ ఒక్క కోటకు కూడా తన బంధువులను అధిపతిగా చేయలేదు. తన 30 సంవత్సరాల పాలన కాలం మొత్తం పాలనా వ్యవస్థను సృష్టించి వికసింప చేయడంలోనే గడిపారు ఆయన యుద్ధాలకు ముందు తరువాత సమయాన్ని పాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో వెచ్చించారు అష్ట ప్రధానులు అనే పేర మంత్రులను నియమించి ఆర్థిక శాఖ ఆనాడే ఆర్థిక శాఖ హోం శాఖ వ్యవసాయ శాఖ న్యాయశాఖ విదేశీ వ్యవహారాల శాఖ శాస్త్ర సాంకేతిక శాఖ రోడ్లు సముద్రయాన శాఖ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భాషా సాంస్కృతిక శాఖ రక్షణ శాఖ ప్రజా సంబంధాల శాఖ అడవులు పర్యావరణ శాఖ అంటూ ఇలా వివిధ భాగాలుగా పాలనను వర్గీకరించి సుపరిపాలన అందించి ఆదర్శ పాలకునిగా నిలిచారు.
*ఆర్థిక వ్యవహారాలు* *క్రమశిక్షణ*
శివాజీ ఆర్థిక వ్యవహారాల కు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు ఒక సందర్భంలో వివిధ మంత్రిత్వ శాఖ లా ఆర్థిక వ్యవహారాలను తెలుసుకున్నప్పుడు దేశ్ కులకర్ణి అనే ఆర్థిక అధికారిని ముందరి రోజు లావాదేవీలు లెక్కలు పూర్తయ్యాయా? అని ప్రశ్నించారు దానికి అధికారి లేదు అని సమాధానమిచ్చాడు అంతేకాదు అలా చేయలేక పోవడానికి గల కారణాలు కూడా ఆ అధికారి తెలియజేశాడు శివాజీ ఈ బాధ్యతారాహిత్యానికి కఠిన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు మరోసారి తన సైన్యాన్ని తనిఖీ చేస్తుండగా ఒక అధికారి ఒక గుర్రం యుద్ధంలో గాయపడి కుంటిది అయిపోయింది అని కాబట్టి దాన్ని అమ్మేందుకు అనుమతి కావాలి అని కోరారు శివాజీ అనుమతిచ్చారు కొద్ది నెలల తర్వాత అధికారి వేరే పనిమీద శివాజీ ని కలిశారు ఆయన్ని చూడగానే శివాజీ ఆ గుర్రాన్ని అమ్మేశారా? అని అడిగారు ఆ అధికారి అమ్మినట్లు చెప్పగానే ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఖాతాల్లో జమ చేశార అని మరో ప్రశ్న వేశారు ఇలా ఆర్థిక రంగంలో అతి చిన్న విషయాలను కూడా పర్యవేక్షించడం ఆయన ఆర్ధిక క్రమశిక్షణ నిజాయితీకి నిదర్శనం
*పన్నుల విధానం*
నేడు ప్రపంచ వాణిజ్యంలో కానీ ఉత్పాదనలను కాపాడేందుకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలను దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అధిక పన్ను విధించడం వంటివి శివాజీ ఆనాడే చేశారు ఒకసారి గోవా నుంచి వచ్చిన పోర్చుగల్ వ్యాపారులు తాము తెచ్చిన ఉప్పును తక్కువ ధరకే రాజ్యంలోని స్థానిక మార్కెట్లలో అమ్ముతున్న విషయం శివాజీ దృష్టికి వచ్చింది తక్షణమే శివాజీ పోర్చుగీసు వారి ఉప్పు పై అధిక పన్ను విధించి స్థానిక ఉప్పు తయారీదారులకు రక్షణ కల్పించారు. అదేవిధంగా స్వరాజ్యం లో భూమిశిస్తు వంటి పన్నుల సేకరణలో ప్రజలను భాగస్వాములుగా చేశాడు ఇలాంటి చర్యల కారణంగా శివాజీ స్వరాజ్యాన్ని ప్రారంభించినప్పుడు అసలు ఖజానా లో డబ్బే లేకున్నా తాను ప్రపంచాన్ని వదిలి వెళ్లే నాటికి ఖజానాలో తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఉన్నాయి
గుర్రాల వ్యాపారం నుండి ఉప్పు వ్యాపారం దాకా మందు గుండు నుండి యుద్ధనౌక ల దాకా శివాజీ నైపుణ్యములను, ప్రక్రియలను దిగుమతి చేసుకోవాలని భావించారు కానీ ఉత్పత్తులను పరికరాలను కాదు
*స్వదేశీ తయారీ*
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్వదేశీ విధానం లోకల్ ఫర్ వోకల్ విధానం నాడే శివాజీ ఆచరించి చూపారు ఆయన రాజ్యంలో లో రాజ్యానికి అవసరమైన పరికరాలు వస్తువుల తయారీ కోసం పద్దెనిమిది ఫ్యాక్టరీలు ఉండేవి ఒకసారి మంచి మందు గుండు సామాగ్రి కోసం ఇంగ్లాండ్ వారి సహాయం అడిగితే జాప్యం చేశారు దాంతో ఫ్రెంచి వారి సహకారంతో పురంధర్ లో లో ఒక ఫిరంగి గుళ్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు ఇందులో తయారయ్యే ఫిరంగి గుళ్ళు స్థానికంగా దొరికే ఇనుము కంచు మిశ్రమ ధాతువులతో తయారయ్యేవి తద్వారా తన రాజ్యంలోని వనరులను తన రాజ్యానికి పరిమితం చేసి అనవసర దిగుమతులను నిరోధించి ఉపాధి కల్పన ను పెంచి స్వావలంబన ఆత్మవిశ్వాసాన్ని పెంచారు.
*విపత్తు సహాయం*
విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల
నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు కు విలక్షణ వ్యవస్థ ఉండేది ఎద్దు చనిపోతే ఇంకొక ఎద్దు ఇచ్చేవారు విత్తనాలు పోతే కొత్త విత్తనాలు ఇచ్చేవారు నాగలి వంటి పరికరాలు పోతే వస్తువులు ఇచ్చేవారు అంతేకానీ ధన సహాయం చేసేవారు కాదు ధన రూపంలో పరిహారం ఇస్తే అనవసర పనులకు ఖర్చు చేస్తారని భావించారు ఆ రోజుల్లోనే శివాజీ ప్రభుత్వ యంత్రాంగం ఇంతటి ఉన్నత స్థాయి ఆర్థిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించింది
స్వయంచాలిత రాజ్యవ్యవస్థ
శివాజీ ఆగ్రా ఖైదులో ఐదు నెలల పాటు గడిపిన దక్షిణాది దండయాత్ర చేసినపుడు ఆరునెలలపాటు రాజ్యానికి దూరంగా ఉన్నా మరోసారి దండయాత్రలో రెండేళ్లపాటు రాజ్యానికి దూరంగా ఉన్నా ఆయన రాజ్య వ్యవస్థ మాత్రం ఏమీ జరగనట్టే ఎక్కడ అసంతృప్తి తిరుగుబాటు అయోమయం లేకుండా చక్కగా నడిచింది.
గూఢచర్య వ్యవస్థ శివాజీ గూడచారి వ్యవస్థ చాలా దూరం వరకు వ్యాపించి ఉండేది. తన రాజ్యం సరిహద్దు బయట కూడా చాలా దూరం వరకు ఉండేది దీని కారణంగానే ఔరంగజేబు ఖైదు నుండి ఇ తప్పించుకొని తన రాజ్యానికి చేరుకున్నాడు.
*పునరాగమనం ఘర్ వాపసీ*
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పునరాగమనం ఘర్ వాపసీ కార్యక్రమం శివాజీ అలనాడే చేశాడు తన కుడి భుజం నేతాజీ పాల్కర్ ను ఔరంగజేబ్ పంపిన రాజా జయసింగ్ ప్రలోభపెట్టి కూలి ఖాన్ గా మత మార్పిడి చేయించాడు. కులీ ఖాన్ గా మారిన పాల్కర్ ను ఔరంగజేబు ఆఫ్ఘనిస్తాన్లో సైనికాధికారిగా నియమించాడు. శివాజీ పట్టాభిషేక సమయంలో దక్షిణాదిపై దండయాత్రకు దిలేరాఖాన్ కు తోడుగా శివాజీని బంధించడానికి కులీఖాన్ గా మారిన పాల్కర్ ను పంపుతాడు. అపుడు అక్కడిదాకా వెళ్ళిన పాల్కర్ మాయమై శివాజీ చెంతకు వచ్చి తనను క్షమించమని విలపిస్తే అతనిని క్షమించి 1676 జూన్19న శుధ్ధీకరణ గావించి తన దగ్గరి బంధువుల అమ్మాయినిచ్చి వివాహం చేసి తిరిగి సేనాధిపతి గా నియమించుకుంటాడు.
*వ్యవసాయం*
శివాజీ పాటు పశుపాలనకు వ్యవసాయానికి ఆనకట్టకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు పూణేలోని ఓదా జలపాతం వద్ద ఒకటి కొంధ్వా వద్ద మరొకటి ఆనకట్టలు నిర్మించాడు యుద్ధాలు లేని సమయంలో వాన కాలంలో సైనికుల చేత కూడా వ్యవసాయం చేయించాడు
*న్యాయ వ్యవస్థ*
తల్లి జిజియా మాత గురువు అయిన దాదాజీ కొండదేవ్ ల నుండి నేర్చుకున్న విలువలను శివాజీ తన తీర్పులో చూపించేవాడు. సంఘటనలను పూర్తిగా అవగాహన చేసుకొని సాక్ష్యాధారాలను పరిశీలించి విశ్లేషించి తీర్పులు చెప్పేవాడు
దారుణాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించే వాడు ఒకసారి గ్రామ పెద్ద అధికార దుర్వినియోగం చేసి మహిళను బలాత్కరిస్తే ఆ గ్రామ పెద్ద యొక్క రెండు చేతులను నరికి వేయమని ఆజ్ఞా పించాడు. మరో సందర్భంలో తన తండ్రి మిత్రుని బంధువు ఖండొజీ ఖోప్దా రాజద్రోహానికి పాల్పడి అఫ్జల్ఖాన్ వైపు వెళ్లిపోతే అఫ్జల్ఖాన్ వధ అనంతరం ఖండొజీ యొక్క ఎడమకాలును, కుడిచేతిని నరికేలా ఆజ్ఞ ఇచ్చి తాను ఎటువంటి ఒత్తిడికి లొంగనని నిరూపించాడు.
విదేశీ వ్యవహారాలు
తన పొరుగు రాజ్యాలతో సంబంధాలునెరిపేటపుడు దౌత్యాన్ని, శక్తిని, యుక్తినీ సమపాళ్లలో ఉపయోగించేవారు శివాజీ. విదేశీ శక్తుల ప్రవర్తనను నిశిత పరిశీలన జేసి అదునుజూసి దెబ్బ కొట్టెవాడు శివాజీ. ఆంగ్లేయులు పన్హాలా యుధ్ధంలో సిద్ధిజౌహార్ కు అనుకూలంగా పనిచేసి యూనియన్ జాక్ ఎగురవేయడం గమనించి తన సమయం రాగానే రాజ్ పూర్లో ఆంగ్లేయుల సరఫరాను ధ్వంసం చేసి వారు పరిహారం అడిగినా ఒక్క చిల్లిగవ్వకూడా చెల్లించలేదు.
సముద్ర జలాలపై ప్రభావాన్ని చూపించారు.
*కర్తవ్య పాలన*
తల్లి చనిపోయిన దుఃఖంలో ఉండి కూడా కర్మకాండలు నిర్వహిస్తూ కూడా పాలకుడిగా తన విధులను యధావిధిగా నిర్వర్తించిన అద్భుత కర్తవ్య నిష్ఠ పరాయణుడు మన శివాజీ
*భాషాభిమాని*
స్వరాజ్య నిర్మాణంలో పనిలో సొంతభాష లేకపోతే అది స్వరాజ్యమే కాదని ప్రకటించిన మాతృభాషాభిమాని శివాజీ. కేవలం ప్రకటనలకే పరిమితం కాక పండితులతో 1400 పదాల నిఘంటువును కూడా తయారు చేయించిన భాషా సేవకుడు శివాజీ
*రక్షణ శాఖ*
శివాజీ సైన్యం అత్యంత క్రమశిక్షణ తోడ నిబద్దత తో అద్వితీయ సాహసంతో ప్రపంచం లోని అత్యుత్తమ సైన్యంగానిలిచింది.
ఒకసారి పాకిస్తానుకు వెళ్ళిన పూణెకు చెందిన పర్యాటకులు పాకిస్తానీ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ ను కలుసుకొవాలని అనుమతి కోరిన మరుక్షణం అతడే ఎన్నో రోజులుగా నేను స్వయంగా మిమ్మల్ని కలుసుకొవాలనుకుంటున్నాను అంటూ... తాను బ్రిటన్ లొ సైనిక శిక్షణ పొందెటపుడు ప్రతాప్ ఘడ్ లో శివాజీ అఫ్జల్ఖాన్ను వధించిన వైనం తెలుసుకున్నప్పటినుండీ అంతటి గొప్ప యుధ్ధం చేసిన మావళీలు ఎలా ఉంటారో చూడాలనుకున్నాను అని చెబుతాడు. దీన్ని బట్టే శివాజీ సైనిక వ్యూహాలు నేటికీ ప్రపంచంలో ఎందరెందరికొ ఆదర్శమని చెప్పవచ్చు.
ఇవే గాకుండా పర్యావరణం, మహిళా సాధికారిత వంటి అనేక అంశాల్లో శివాజీ వ్యక్తిత్వం నేటికీ అనుసరణీయంగా ఉంటోంది.
సరైన బలమైన పరిపాలన కోరుకునే వారికి శివాజీ పాలన ఒక ఆదర్శం కావాలి. నేటి నేతలు శివాజీలా జన హృదయ నేతలు కావాలి.
*జై భవాని వీర శివాజీ*